బయోపిక్ నుండి జాన్వీ లుక్ లీక్ !

బయోపిక్ నుండి జాన్వీ లుక్ లీక్ !

Published on Dec 27, 2018 12:45 AM IST

jahnavi31

యువ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించిన మొదటి చిత్రం ‘దఢక్’ ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో ఆమెకు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈసినిమా తరువాత జాన్వీ ఒక బయోపిక్ లో నటించనుంది. మహిళా వైమానిక యోధురాలు గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా ఈ బయోపిక్ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో జాన్వీ , గుంజన్ పాత్రలో నటించనుంది. ప్రస్తుతం ఈ చిత్రం కోసం జాన్వీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో శిక్షణ తీసుకుంటుంది. ఇక తాజాగా గుంజన్ లుక్ లో ఉన్న జాన్వీ పిక్ బయటికొచ్చింది.

త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. జాన్వీ ఈ చిత్రం తో పాటు కరణ్ జోహార్ నిర్మించనున్న మల్టీ స్టారర్ మూవీ ‘తక్త్’ లో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తాజా వార్తలు