జానీ మాస్టర్ హీరోగా మరో సినిమా.. అప్డేట్ ఇదే..!

Published on Jul 2, 2021 1:04 am IST


జానీ మాస్టర్.. మనందరికి ఈ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఆయన కంపోజ్ చేసే స్టెప్పులు చూస్తే మన బాడీలోని పార్ట్స్ అష్టవంకరలు తిరుగుతుంటాయి. ఆయన కంపోజ్ చేసే ఏ పాటైనా బొమ్మ దద్దరిల్లాల్సిందే. ఖైదీ నంబర్ 150లో సుందరి, రంగస్థలంలో జిల్ జిల్ జిగేలు రాణి, అలవైకుంఠపురంలో బుట్టబొమ్మ, ఇస్మార్ట్ శంకర్‌లో టైటిల్ సాంగ్, రెడ్‌లో డించక్.. డించక్, భీష్మలో వాట్టే వాట్టే బ్యూటీ, మారి-2లో రౌడీ బేబీ వంటి ఎన్నో హిట్ పాటలను జానీనే కంపోజ్ చేశారు.

ఇటీవల రాధేలో సీటీమార్ పాట ద్వారా సల్మాన్‌తో స్టెప్పులేయించి ఉత్తరాది ప్రేక్షకులను ఉర్రూతలూగించిన జానీ ప్రస్తుతం తమిళ టాప్ స్టార్ విజయ్ ‘బీస్ట్’ చిత్రానికి కంపోజింగ్ చేస్తున్నాడు. అయితే కొరియోగ్రాఫర్‌గా తనకంటూ ఓ స్టేటస్‌ను సెట్ చేసి పెట్టుకున్న జానీ హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే హీరోగా తొలి సినిమా ప్రారంభించిన జానీ తాజాగా రెండో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అయితే మంత్ర, మంగళ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన ఓషో తులసీరామ్ తో జానీ తన రెండో సినిమాను చేస్తున్నాడు. జానీ మాస్టర్ పుట్టినరోజు రేపు కావడంతో ఈ సినిమాకు ‘దక్షిణ’ అనే టైటిల్‌ను ఖరారు చేసి అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ఓషో తులసీరామ్ మాట్లాడుతూ ఈ సినిమాకు ‘దక్షిణ’ అనే టైటిల్ ఖరారు చేసి అనౌన్స్ చేశారు. అయితే ఒక సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథ అని, త్వరలోనే సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :