చరణ్ సాంగ్ కి అదరగొట్టేసిన జపాన్ ఫాలోవర్స్..!

Published on Jul 1, 2021 7:06 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అవ్వడానికి మెగాస్టార్ చిరంజీవి తనయుడి ట్యాగ్ తోనే వచ్చినా తన స్వేదంతో సిసలైన మెగా లెగసి క్యారియర్ గా నిలబడ్డాడు.. ఇప్పుడు పాన్ ఇండియన్ లెవెల్లో మరోసారి బలంగా నిలబడే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ అయినటువంటి రెండు చిత్రాల్లో ఒకటి “మగధీర” కాగా “రంగస్థలం” కూడా ఒకటి..

అయితే వాటిలో మగధీర సినిమాతో జపాన్ దేశ ప్రేక్షకులకు చరణ్ మరింత దగ్గరయ్యిపోయాడు.. అప్పుడు నుంచి చాలా మంది అభిమానులే చరణ్ పట్ల తమ అభిమానాన్ని కనబరిచారు.. అయితే మరి ఇప్పుడు ఓ జపాన్ కపుల్ మాత్రం చరణ్ ఎనర్జిటిక్ రంగస్థలం సాంగ్ ‘జిగేలు రాణి’ కి సేమ్ ఎనర్జీతో ఆదరగొట్టేశారు.. ఇప్పుడు ఇదే మెగా ఫ్యాన్స్ లో మంచి వైరల్ అవుతుంది. మరి ప్రస్తుతం చరణ్ “RRR” మరియు “ఆచార్య” అనే రెండు భారీ మల్టీస్టారర్ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :