ఈ ఏడాది మన టాలీవుడ్ లో రిలీజ్ అయ్యి భారీ హిట్ అయ్యిన చిత్రాల్లో “జాతి రత్నాలు” కూడా ఒకటి. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్టయింది. మరి అనుదీప్ కేవీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మ్యూజిక్ ఆల్బమ్ కూడా దీనికి ఇంత మంచి హైప్ తీసుకురావడానికి కారణం అని చెప్పాలి.
రాధన్ మ్యూజిక్ ఇచ్చిన ఈ ఆల్బమ్ లో చిట్టి సాంగ్ అయితే పెద్ద చార్ట్ బస్టర్.. మరి ఈ సాంగ్ ఇప్పుడు 100 మిలియన్ మార్క్ ను అందుకొని మంచి రికార్డ్ సెట్ చేసింది. రాహుల్ రామకృష్ణ మరియు ప్రియదర్శిలు మరో కీలక పాత్రల్లో నటించిన ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ నుంచి సీక్వెల్ ని కూడా మేకర్స్ ప్లాన్ చేశారు అది కూడా మంచి టైం లో స్టార్ట్ చెయ్యనున్నారు. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.


