జెర్సీ కాంబినేషన్ లో ఓ జవాన్ బయోగ్రఫీ !

Published on Jul 12, 2021 9:05 am IST

జెర్సీ కాంబినేషన్ మళ్లీ స్టార్ట్ కానుందని, నేచురల్ స్టార్ నాని కోసం ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి మరో ఎమోషనల్ స్టోరీ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ సారి చేయబోయే సినిమా పాన్ ఇండియా మూవీ అని, నానికి కథ బాగా నచ్చిందని తెలుస్తోంది. కాళ్లు కోల్పోయిన ఓ జవాన్ లైఫ్ స్టైల్ ను అతని పాయింట్ ఆఫ్ వ్యూలో చెబుతూ… దేశం కోసం వాళ్ళు ఎంతగా త్యాగం చేస్తారో లాంటి అంశాలను ఈ సినిమాలో హైలైట్ అయ్యేలా గౌతమ్ ప్లాన్ చేస్తున్నాడట.

ఇక ఈ సినిమాలో కూడా ఫ్లాష్ బ్యాక్ మెయిన్ అట. ఈ ఏడాది నవంబర్ లో ఈ సినిమాని మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. కాగా గౌతమ్ ప్రస్తుతం ‘జెర్సీ’ సినిమాని హిందీలోకి రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోగా షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. హీరోయిన్ గా మృణాల్‌ ఠాకూర్‌ కనిపించనుంది. అయితే తెలుగు జెర్సీలో కొన్ని మార్పులు చేసి హిందీలోకి తెరకెక్కిస్తున్నాడు గౌతమ్. మరి గౌతమ్ తిన్ననూరి హిందీలో ఏ రేంజ్ లో సక్సెస్ అవుతాడో చూడాలి

సంబంధిత సమాచారం :