ఆ పాత్రకు రమ్యకృష్ణ అయితేనే.. !

ఆ పాత్రకు రమ్యకృష్ణ అయితేనే.. !

Published on Mar 2, 2019 3:06 PM IST

Ramya Krishna

దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితకథ ఆధారంగా ఆమె బయోపిక్ ను వెబ్ సిరీస్ గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసందే. జయలలిత జీవితాన్ని మొత్తం 32 ఎపిసోడ్స్ ఉండేలా రూపొందించనున్నారు. గౌతమ్ ఈ నెలాఖరులో కీలకమైన సన్నివేశాలను షూట్ చేయనున్నారు.

ఇక జయలలిత పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుంది. జయలలితగారి లాంటి బలమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలంటే రమ్యకృష్ణ లాంటి బలమైన నటి అయితేనే ఆ పాత్రకు పూర్తి న్యాయం జరుగుతుంది. అయితే ఇప్పటికే ఏఎల్ విజయ్, ప్రియదర్శిని, భారతాయి రాజా ఇలా పలువురు దర్శకులు జయలలితగారి జీవితకథ ఆధారంగా సినిమాలు తీస్తున్నారు. మరి వీరి సినిమాల్లో ఏ సినిమా సక్సెస్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు