జయలలిత జీవితంలోని అన్ని కోణాలు చూపించనున్నారా..!

Published on Dec 6, 2019 12:47 am IST

జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ క్వీన్. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ జయలలిత పాత్ర చేస్తుండటంతో పాటు, టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వ భాగస్వామ్యంలో తెరకెక్కుతున్న సిరీస్ కావడంతో క్వీన్ పై భారీ అంచనాలున్నాయి. కాగా నేడు జయలలిత వర్ధంతిని పురస్కరించుకొని క్వీన్ ట్రైలర్ విడుదల చేశారు. రెండున్నర నిమిషాలకు పైగా ఉన్న ఆ ట్రైలర్ చూస్తుంటే గౌతమ్ మీనన్ అద్భుతంగా జయలలిత జీవితాన్ని ఆవిష్కరించనున్నారు అని అర్థం అవుతుంది.

జయలలిత బాల్యం.. స్కూల్ విద్యార్థిగా తన ప్రతిభ వంటి విషయాలు మరియు సినీ అరంగేట్రం తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదగడం వంటి విషయాలు ట్రైలర్ లో ప్రస్తావించారు. ముఖ్యంగా ఎం జి ఆర్ తో ఆమెకు పరిచయం ఎలా ఏర్పడింది, అసలు ఆమె రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది వంటి అనేక విషయాలు క్వీన్ సీరిస్ లో చూయించనున్నారు. ఈ నెల 14నుండి క్వీన్ ఎపిసోడ్స్ ప్రసారం కానున్నాయి. గౌతమ్ మీనన్ మరియు ప్రశాంత్ మురుగేషన్ దర్శకత్వం వహించగా, రేష్మ ఘటాల రచించారు.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More