జెడి చక్రవర్తికి సూపర్ స్టార్ సినిమాలో బంపర్ ఆఫర్

jdchakravarthy
ఒకప్పుడు తెలుగు హీరోలలో ఎప్పుడూ గడ్డంతో కనిపిస్తూ గడ్డం చక్రవర్తిగా మంచి పేరు తెచ్చుకున్న హీరో జెడి చక్రవర్తి. ప్రస్తుతం తను చేస్తున్న సినిమాల జోరు తగ్గినా అడపాదడపా జెడి చక్రవర్తి కొన్ని ముఖ్య పాత్రల్లో కనిపించి మెప్పించాడు. జోష్ సినిమాలో నెగటివ్ షేడ్స్ చూపిన జెడి ప్రస్తుతం మంచు విష్ణు నటించిన ‘డైనమైట్’ సినిమాలోనూ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. డైనమైట్ ఒరిజినల్ వెర్షన్ అయిన తమిళ మూవీ అరిమ నంబిలో కూడా ఆయనే విలన్ గా కనిపించాడు. ఇది కాకుండా తాజాగా జెడి ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే బంపర్ ఆఫర్ కొట్టేసాడు.

ప్రస్తుతం కోలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించనున్న తదుపరి సినిమాలో జెడి చక్రవర్తి నటించే చాన్స్ కొట్టేసాడు. పిఎ రంజిత్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో జెడి చక్రవర్తి నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేయనున్నాడా.? లేక పాజిటివ్ రోల్ చేయనున్నాడా అన్నది తెలియాల్సి ఉంది. ఆగష్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాలో రజినీకాంత్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రాధిక ఆప్టేని ఎంపిక చేసినట్లు సమాచారం.

Exit mobile version