‘దృశ్యం 3’ కూడ ఉండొచ్చట

Published on Feb 22, 2021 11:00 pm IST

ఇటీవల అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైన చిత్రాల్లో మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం 2’ మంచి విజయాన్ని అందుకుంది. ‘దృశ్యం’ చిత్రానికి ఇది సీక్వెల్. ఈ రెండు సినిమాలను రూపొందించిన దర్శకుడు జీతూ జోసెఫ్. ఈ సినిమాలతో జీతూ జోసెఫ్ పేరు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ‘దృశ్యం’ తెలుగుతో పాటు ఇంకొన్ని ఇతర భాషల్లోకి కూడ రీమేక్ కాబడి విజయాన్ని అందుకుంది.

ఇప్పుడు రిలీజైన ‘దృశ్యం 2’ సైతం ఇతర భాషల్లోకి రీమేక్ కానుంది. మొదటగా తెలుగులో వెంకటేష్ రీమేక్ చేయడానికి ముందగుడు వేశారు. దీనికి దర్శకత్వం జీతూ జోసెఫ్ చేయనున్నారు. వచ్చే నెల నుండి ఈ సినిమా మొదలుకానుంది. ఇకపోతే సీక్వెల్ ముగింపులో కూడ థర్డ్ పార్ట్ కోసం లీడ్ వదిలారు జీతూ జోసెఫ్. జార్జ్ కుట్టి పాత్ర తన కుటుంబం కోసం ఎప్పుడూ ప్రమత్తంగానే ఉండాలి. రాబోయే ఆపదను కనిపెట్టి కుటుంబాన్ని కాపాడుకోవాలి అంటూ ముగించారు. దీన్నిబట్టి 3వ భాగం చేయాలనే ఉద్దేశ్యం దర్శకుడికి బలంగా ఉన్నట్టు రూఢీ అయింది. జీతూ జోసెఫ్ సైతం ‘దృశ్యం’ తీశాక సీక్వెల్ ఉంటుందని అనుకోలేదు. కానీ జరిగింది. ఇప్పుడు కూడ అంతే. మంచి లీడ్ స్ట్రైక్ అయితే ‘దృశ్యం 3’ తప్పకుండా తీస్తాను అంటున్నారు.

సంబంధిత సమాచారం :

More