లిప్ లాక్ సీన్స్ పై స్పందించిన జీవితా రాజ‌శేఖ‌ర్ !

Published on May 3, 2019 8:00 pm IST

తెలుగు సినిమాల్లో ఈ మ‌ధ్య ఎక్కువుగా వస్తోన్న లిప్ లాక్ సీన్స్ గురించి జీవితా రాజ‌శేఖ‌ర్ మాట్లాడారు. న‌ర‌సింహ నంది ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘డిగ్రీ కాలేజ్‌’ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మంకు ముఖ్య అతిథిగా వ‌చ్చిన జీవితా రాజ‌శేఖ‌ర్, ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. అయితే ఆ ట్రైల‌ర్‌ లో అడ‌ల్ట్ కంటెంట్ మరి ఎక్కువ‌గా ఉండటంతో ఆమె ఈ విషయం గురించి మాట్లాడారు.

జీవితా రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ… ఆర్.ఎక్స్ 100, అర్జున్ రెడ్డి పుణ్యమా అని, తెలుగు సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ లేకుండా ఉండటంలేదు. కాలేజ్ స్టూడెంట్స్ అంటే మేక్ అవుట్స్ లేకుండా, లిప్ లాక్స్ లేకుండా సినిమాలు తీయ‌కూడ‌దు అనే ప‌రిస్థితికి తెలుగు సినిమా దిగ‌జారిపోయింద‌నుకుంటున్నాను. అయిన ప్ర‌తి మ‌నిషి జీవితంలో శృంగారం ఉంటుంది. ఉన్నంత మాత్రాన అది ఎక్క‌డ చేయాలో అక్క‌డే చేస్తే బావుంటుంది. ప‌బ్లిక్‌గా రోడ్డు పై చేస్తే అస‌హ్యంగా ఉంటుంది అని ఆమె చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :

More