జెర్సీ ఫస్ట్ లుక్ విడుదల తేదీ ఖరారు !

Published on Dec 29, 2018 2:35 pm IST


న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘జెర్సీ’ చిత్రం యొక్క షూటింగ్ శరవేంగంగా జరుగుతుంది. ‘మళ్ళీరావా’ ఫేమ్ గౌతమ్ తెరకెక్కిస్తున్న ఈ పిరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా లో కన్నడ నటి శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈచిత్రంలోని నాని కి సంబందించిన ఫస్ట్ లుక్ ను వచ్చే ఏడాది జనవరి 1న న్యూ ఇయర్ రోజు విడుదలచేయనున్నారు. ఈ చిత్రంలో నాని అర్జున్ అనే క్రికెటర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని గౌతమ్ చాలా రియలిస్టిక్ గా రూపొందిస్తున్నాడట. ఎమోషనల్ సన్నివేశాలు ఈచిత్రానికి హైలైట్ కానున్నాయని సమాచారం.

సితార ఎంటెర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2019 ఏప్రిల్ 19న ప్రేక్షకులముందుకు రానుంది. ఇక క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ జెర్సీ ఫై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :