జెర్సీ కోలీవుడ్ లోను విడుదలకానుంది !

Published on Feb 13, 2019 12:55 am IST

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ లో 8 పాటలు ఉన్నాయని సమాచారం. ప్రేమికుల రోజు కానుకగా ఈనెల 14 న ఈచిత్రం నుండి మొదటి సాంగ్ ‘అదేంటో గాని ఉన్నపాటుగా’ విడుదలకానుంది. తాజాగా అదే రోజు ఈ సాంగ్ తమిళం లోనూ విడుదలకానుంది. ‘మరెక్కవిల్లై’ అంటూ సాగె ఈ పాటకు కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ లిరిక్స్ అందించారు. సో దాన్ని బట్టి ఈ చిత్రాన్ని అక్కడ కూడా విడుదల చేయన్నునారని తెలుస్తుంది. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కావడం తో మిగితా భాషల్లో కూడా విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటెర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తుండగా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఏప్రిల్లో ఈ చిత్రం విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :