స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో నాని నటిస్తున్న చిత్రం జెర్సీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం నిర్మాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రాన్ని మొదటగా ఏప్రిల్ 19న విడుదలకానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇటీవల ఈ రిలీజ్ డేట్ ను ఏప్రిల్ 5 వ తేదీ కి మార్చనున్నారని వార్తలు వచ్చాయి. అయితే మహేష్ నటిస్తున్న మహర్షి సినిమా మే 9 కి రిలీజ్ కానుండడం తో ఈ జెర్సీ ని 19 నే విడుదలచేయనున్నామని మేకర్స్ అధికారకంగా వెల్లడించారు . ఇక ఈ చిత్రాన్ని నార్త్ ఇండియాలో విడుదల చేయనుంది ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ పనోరమా స్టూడియోస్.
‘మళ్ళీరావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం లో నాని సరసన కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తుంది. అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.


