షూట్ కి రెడీ అయిన హిందీ ‘జెర్సీ’ !

Published on Dec 14, 2019 8:02 pm IST

నాని నటించిన ‘జెర్సీ’ చిత్రం హిందీలోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోగా షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. హీరోయిన్ గా మృణాల్‌ ఠాకూర్‌ కనిపించనుంది. కాగా వచ్చే వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొడలుకానుంది. ఫస్ట్ షెడ్యూల్ ను చండీగఢ్ లో షూట్ చేసుకోబోతుంది. అక్కడ లొకేషన్స్ సినిమాలోని సీన్స్ కి బాగా సూట్ అవుతాయని.. అక్కడ షూట్ చేస్తున్నారు. ఇప్పటికే షాహిద్ క్రికెటర్ పాత్ర కోసం ట్రైనింగ్ కూడా మొదలుపెట్టారు. షాహిద్ కపూర్ ఇంతకుముందే తెలుగు చిత్రం ‘అర్జున్ రెడ్డి’ని హిందీలోకి ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి భారీ హిట్ అందుకొన్నారు. ఇప్పుడు కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతూ చేస్తున్న ఈ సినిమా మీద హిందీ ప్రేక్షకుల్లో అమితాశక్తి నెలకొని ఉంది.

ఇక తెలుగులో దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీ వర్షన్ ను కూడా డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు నిర్మిస్తుండగా వీరిద్దరితో పాటు బాలీవుడ్ నిర్మాత ఆమన్ గిల్ నిర్మాణంలో భాగస్వామం తీసుకున్నారు.
2020 ఆగష్టు 28వ తేదీన చిత్రం విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

X
More