సమీక్ష : జెస్సీ – హర్రర్ తక్కువ ట్విస్ట్ లు ఎక్కువ !

Published on Mar 16, 2019 4:00 am IST

విడుదల తేదీ : మార్చి 15, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : అభినవ్ గౌతమ్, అతుల్ కుల్కర్ణి, కబీర్ డుహాన్ సింగ్, పావని గంగిరెడ్డి

దర్శకత్వం : వి అశ్వని కుమార్

నిర్మాత : శ్వేతా సింగ్

సంగీతం : శ్రీచరణ్ పాకాలా

సినిమాటోగ్రఫర్ : సునీల్ కుమార్ ఎన్

ఎడిటర్ : గ్యారీ బీ హెచ్

అశ్వినీ కుమార్ వి దర్శకత్వంలో క‌బీర్ దుహ‌న్ సింగ్‌, ఆషిమా న‌ర్వాల్, అర్చన, అతుల్ కుల‌కర్ణి ప్రధాన తారాగ‌ణంగా రూపొందిన సైకిలాజికల్ హార‌ర్ థ్రిల్లర్ ‘జెస్సీ’. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

విక్టోరియా హౌస్‌ లో దెయ్యాలు ఉన్నాయని అక్కడకి వెళ్లిన వాళ్లు అందరూ చనిపోతారు. ఈ క్రమంలో
ఘోస్ట్ హంటర్స్‌ నలుగురు (అభినవ్ గౌతమ్, అభిషేక్, పూర్ణిమ, పావణి గంగిరెడ్డి) అసలు అక్కడ నిజంగానే దెయ్యాలు ఉన్నాయా.. ఉంటే ఉన్నాయని వాటిని ప్రాక్టికల్ ప్రూవ్ చెయ్యడానికి ఆ విక్టోరియా హౌస్‌ కి వస్తారు. అక్కడ వాళ్లకు కొన్ని భయానిక వింత అనుభవాలు ఎదురౌతాయి. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం వీరికి విక్టోరియా హౌస్‌లో ఉండే ఇద్దరు అక్కచెల్లెల్లు జెస్సీ (అష్మిత నర్వాల్), యమి (శ్రీత చందన) కథ తెలుస్తోంది. ఆ తరువాత ఏమి జరిగింది ? ఆ ఘోస్ట్ హంటర్స్‌ ఏం అయిపోయారు అనేదే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

మనుషులు చనిపోయాక వారి ఆత్మలు ప్రేతాత్మలుగా మారతాయా?అసలు దెయ్యాలు ఉన్నాయా.. ? వాటి వల్ల ఆపదలు వస్తాయా ?అనే పాయింట్ తో ఘోస్ట్ హంటర్లు పాయింట్ అఫ్ వ్యూ లో దర్శకుడు అశ్వినీ కుమార్ వి ఈ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా కొత్త నటీనటులతో ఇలాంటి హారర్ హంటర్ కాన్సెప్ట్ ను తియ్యడం మాటలు కాదు. కానీ అశ్వినీ కుమార్ వి మంచి దర్శకత్వ పనితనం కనబరిచారు.

ఇక సినిమాలో ప్రధాన పాత్ర జెస్సీ పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు టపాయింట్ అఫ్ వ్యూస్.. మొత్తానికి జెస్సీ ఆత్మ ఘోష తాలూకు పెయిన్.. అలాగే సెకెండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు వంటి అంశాలు సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ నటించిన ఆషిమా న‌ర్వాల్ తన పాత్రకు తగ్గట్లు… తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్:

దర్శకుడు అశ్వినీ కుమార్ వి రాసుకున్న కాన్సెప్ట్.. అలాగే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. కథ కథనాలు మరీ విభిన్నంగా ఉండటం దానికి తోడూ కథనంలో ప్లో కూడా మిస్ అయింది. ముఖ్యంగా ఆయన రాసుకున్న సెకెండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు మరియు క్లైమాక్స్ ప్రేక్షకుడికి సినిమా పై కలిగే ఆసక్తిని నీరుగారుస్తాయి. సెకెండ్ హాఫ్ లో కొన్ని చోట్ల బోర్ కొట్టిస్తోంది.

పైగా సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో కథలో సహజత్వం చాలా వరకు లోపించినట్లు అనిపిస్తోంది. ఇంటర్వెల్ సీన్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలను కన్వీన్స్ గా చెప్పడంలో దర్శకుడు విఫలమైయ్యారు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే..
కెమెరామెన్ కెమెరా పనితనం హార్రర్ సన్నివేశాలల్లో బాగుంది. సంగీత దర్శకుడు అందించిన సంగీతం కూడా ఆకట్టుకుంది. ఎడిటర్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఆయన దర్శకుడు ఏది చెబితే అది కట్ చేసుకుంటూ వెళ్ళిన్నట్లు అనిపిస్తోంది. సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

అశ్వినీ కుమార్ వి దర్శకత్వంలో సైకిలాజికల్ హార‌ర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ థీమ్ తో పాటు కొన్ని హర్రర్ సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ.. సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా సాగలేదు. కానీ అశ్వినీ కుమార్ వి దర్శకుడిగా ఆయన చేసిన ప్రయత్నం అయితే బాగుంది గానీ, కాకపోతే ఆయన రాసుకున్న సెకెండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు మరియు క్లైమాక్స్ ప్రేక్షకుడికి సినిమా పై కలిగే ఆసక్తిని నీరుగారుస్తాయి. అలాగే సెకెండ్ హాఫ్ లో కొన్ని చోట్ల బోర్ కొట్టిస్తోంది. మొత్తం మీద ఈ ‘చిత్రం’ పూర్తిగా ఆకట్టుకోదు. అయితే కొత్తధనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా పర్వాలేదనిపిస్తోంది.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :

More