ఇండస్ట్రీకి కొత్త విలన్ దొరికాడు

ఇండస్ట్రీకి కొత్త విలన్ దొరికాడు

Published on Mar 30, 2015 9:27 PM IST

Jil
ఇటీవలే విడుదలైన గోపీచంద్ ‘జిల్’ సినిమా చూసిన వారంతా హీరో, హీరోయిన్, డైరెక్టర్ ల గురించి కంటే ఆ సినిమాలో విలన్ పాత్ర పోషించిన కబీర్ పాత్రకు కనెక్ట్ కావడం విశేషం. చూడ్డానికి కాస్త కొత్తగా, నటనలో మాత్రం చాలా స్టైలిష్ గా ఈ విలన్ తొలిచూపులోనే ఆకట్టుకుంటాడు.

ఇంతకాలం వున్నా ప్రతినాయకుల చుట్టూ తిరుగుతున్న మన దర్శకులకు కొత్త ఆప్షన్ లభించినట్టే. ప్రస్తుతం కబీర్ కిక్ 2లో విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఇవేకాక చేతిలో మరో రెండు ఇతర భాషా చిత్రాలు వున్నట్టు సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు