
2014లో తమిళనాట విడుదలై మంచి విజయం సాధించిన జిల్లా చిత్రం ఇప్పుడు అదే పేరుతొ తెలుగులోకి అనువాదంకానుంది. విజయ్, కాజల్ ప్రధానపాత్రధారులు. మలయాళ నటుడు మోహన్ లాల్ ముఖ్యపాత్ర పోషించాడు. ఈ సినిమాను తెలుగులో తిరిగి తెరకెక్కించే ప్రయత్నం చేసినా అది కార్యరూపం దాల్చలేదు.
ఇప్పుడు ఎట్టకేలకు తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి మోక్షం కలిగింది. ఈ చిత్ర ఆడియో లాంచ్ రేపు శ్రేయాస్ మీడియా ఆద్వర్యంలో జరగనుంది.
సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యా నర్ లో ఆర్.బి చౌదరి నిర్మించనున్నారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర 100కోట్లు కలెక్ట్ చేసింది. త్వరలో ఈ చిత్రం తెలుగులో విడుదలకానుంది.