‘జై లవ కుశ’ మొదటిరోజు ఏపి, నైజాం కలెక్షన్ల వివరాలు !
Published on Sep 22, 2017 9:26 am IST


తారక్ తాజా చిత్రం ‘జై లవ కుశ’ భారీ స్థాయిలో నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ మూలాన ఓపెనింగ్స్ మంచి స్థాయిలో వచ్చాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. కొన్ని ఏరియాల్లో తారక్ గత సినిమాల రికార్డుల్ని ఈ చిత్రం అధిగమించేసింది.

కలెక్షన్లకు కీలకమైన నైజాం ఏరియాలో చూసుకుంటే రూ.5.05 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం సీడెడ్లో రూ. 3.77 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే మొదటిరోజు షేర్ రూ.20 కోట్ల పైనే ఉంటుందని అంచనా. ఇకపోతే ఓవర్సీస్లో కూడా ప్రీమియర్ల ద్వారా ఈ చిత్రం హాఫ్ మిలియన్ మార్కును అందుకుంది. ఈ వసూళ్ల పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొంత సమయం వెయిట్ చేయాల్సిందే.

 
Like us on Facebook