‘బాహుబలి-2’ తర్వాతి స్థానంలో ‘జై లవ కుశ’ !
Published on Sep 20, 2017 12:30 pm IST


ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం ‘జై లవ కుశ’ ఇంకెద్ది గంటల్లో రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ ఎంతో ఛాలెంజింగా తీసుకుని చేసిన సినిమా కావడంతో తీసుకుని చేసిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఈ చిత్రంపై ఎన్నో అంచనాలున్నాయి. అలాగే భారీ బడ్జెట్ తో రూపొంది ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా తారా స్థాయిలో జరగడంతో మొదటిరోజే ఓపెనింగ్స్ రూపంలో వీలైనంత ఎక్కువ కలెక్షన్లు రాబట్టాలని చూస్తున్న చిత్ర టీమ్ భారీస్థాయి రిలీజ్ ప్లాన్ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లోనేకాక, ఓవర్సీస్, ఇతర ఏరియాల్లో అందుబాటులో ఉన్న అన్ని థియేటర్లలో సినిమాను ప్రదర్శిస్తున్నారు. రేపు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 2400 ల పైగా స్క్రీన్లలో తొలి ఆట పడనుంది. ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక స్క్రీన్లలో రిలీజవుతున్న సినిమా ఇదే కావడం విశేషం. దర్శకుడు బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాశీ ఖన్నా, నివేతా లు హీరోయిన్లుగా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

 
Like us on Facebook