ఇంటర్వ్యూ : ‘జోడి’ డైరెక్టర్ విశ్వనాథ్ అరిగెల – నిజ జీవితంలో జరిగే సంఘటనలే.. నా సినిమాలు !

ఇంటర్వ్యూ : ‘జోడి’ డైరెక్టర్ విశ్వనాథ్ అరిగెల – నిజ జీవితంలో జరిగే సంఘటనలే.. నా సినిమాలు !

Published on Aug 28, 2019 4:28 PM IST

విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో ఆది సాయికుమార్ హీరోగా ‘జెర్సీ’ ఫేమ్ శ్రధ్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా రాబోతున్న సినిమా ‘జోడి’. కాగా ‘నీవే’ ఫణికళ్యాణ్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం వచ్చే నెల 6వ తేదీన విడుదలకు సిద్ధమైంది. కాగా ఈ సందర్భంగా దర్శకుడు విశ్వనాథ్ అరిగెల మీడియాతో మాట్లాడారు. మరి సినిమా గురించి విశ్వనాథ్ అరిగెల వెల్లడించిన పలు ఆసక్తికర విశేషాలు విశ్వనాథ్ మాటల్లోనే..

 

ముందుగా, మీ సినీ ప్రయాణం గురించి చెప్పండి ?

 

2004లో నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఎమ్మెస్ రాజుగారు నిర్మించిన ‘వాన, మస్కా’ చిత్రాలకు అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశాను. ఆయనతో అలా మూడేళ్ళ కలిసి ప్రయాణం చేశాక, నటుడు చిన్నా చేసిన ‘ఆ ఇంట్లో’ మూవీకి కూడా చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశాను.

 

మీకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చాల అనుభవం ఉంది. మరి, మొదటి సినిమాకి ఇన్నేళ్ల సమయం ఎందుకు పట్టింది. మధ్యలో గ్యాప్ తీసుకున్నారా..?

 

కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల, 2010లో నేను ఇండస్ట్రీ నుండి బయటకి వెళ్లిపోయాను. సినిమా వదిలేసి బెంగుళూరులో జాబ్ చేస్తున్నా.. ఎప్పుడూ నన్ను సినిమా ఆలోచనలే వెంటాడేవి. కథలు గురించి, క్యారెక్టర్స్ గురించే ఎక్కువుగా ఆలోచించేవాడ్ని. దాంతో, మళ్ళీ 2013లో నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది.

 

ఇండస్ట్రీలోకి మీరు రీఎంట్రీ ఇచ్చాక, ఎటువంటి స్ట్రగుల్స్ అనుభవించారు ?

 

నిజానికి ఇక్కడకి రాగానే నాకు అవకాశాలు ఈజీగా వస్తాయని భావించాను, కానీ అలా జరగలేదు. అందుకే రాజ్ తరుణ్ హీరోగా చేసిన ‘సినిమా చూపిస్తా మావ’ మూవీకి వర్క్ చేశాను. ఆ మూవీ మంచి విజయం సాధించింది. దాంతో నేను, ఓన్ గా నా మూవీ డైరెక్ట్ చేయాలని స్క్రిప్ట్ రాసుకొని మొదట విజయ్ దేవరకొండకు స్టోరీ చెప్పాను. అప్పటికీ విజయ్ ‘పెళ్లి చూపులు’ మూవీ కూడా విడుదల కాలేదు. ఐతే విజయ్ ద్వారానే ‘జోడి’ నిర్మాతను కలుసుకోవడం జరిగింది. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల విజయ్ దేవరకొండతో సినిమా కుదరలేదు. అయితే నన్ను డైరెక్టర్ గా మొదట బాగా నమ్మింది మాత్రం విజయ్ దేవరకొండే.

 

ఈ ‘జోడి’ ఏ వర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ?

 

అన్ని వర్గాల ప్రేక్షకులకు మా ‘జోడి’ బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ సినిమాలోని అన్ని పాత్రలు చాలా నాచురల్ గా ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సంఘటనలే ఈ సినిమాలో ప్రధాన ఎలిమెంట్స్ గా సాగుతాయి. ఖచ్చితంగా సినిమాలో ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. ఆ రియలిస్టిక్ ఇన్సిడెంట్సే ప్రతి ఒక్కర్నీ బాగా ఇంప్రెస్ చేస్తాయి.

 

హీరో ఆది సాయికుమార్ గురించి చెప్పండి ?

 

ఒక కొత్త డైరెక్టర్ కి ‘ఆది’ లాంటి హీరో దొరకడం నిజంగా పెద్ద అదృష్టం. ఎందుకంటే కొత్త డైరెక్టర్ అయినా, ఆ డైరెక్టర్ ఆలోచనలకు తగ్గట్లు ఆయన పని చేస్తారు. ఆ విషయంలో మాత్రం ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. ఇక ఈ కథకు ఆది గారే కరెక్ట్. సినిమా రిలీజ్ అయ్యాక, మీరు కూడా అలాగే ఫీల్ అవుతారు.

 

హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ గురించి ?

 

శ్రద్ధ ఒక బోర్న్ ఆర్టిస్ట్ అండి. ఇప్పటికే తను గుడ్ ఆర్టిస్ట్ గా నిరూపించుకుంది. ఈ సినిమాకు తను పెద్ద అసెట్ అనుకోవచ్చు. సినిమాలో తన పాత్ర కూడా చాల ఎమోషనల్ గా ఉంటుంది.

 

ఈ సినిమాలో మ్యూజిక్ చాల బాగుందని అందరూ అంటున్నారు ?

 

నిజంగానే ఫణి చాల మంచి మ్యూజిక్ ఇచ్చారు. తను, నేను కొత్త ట్యూన్స్ కోసం చాలా డిస్కషన్స్ చేసాం. ఆల్బమ్ ఇంత బాగా వచ్చిందంటే, అది.. ఫణి ఇచ్చిన కోపరేషన్ వల్లే. ఈ సినిమా పాటలతో పాటు అలాగే మాటలు కూడా హైలెట్ గా నిలుస్తాయి.

 

ఈ సినిమా ప్రొడ్యూసర్ గురించి చెప్పండి ?

 

ఈ సినిమా చాల బాగా రావడానికి ప్రొడ్యూసర్ విజయ లక్ష్మిగారు కూడా ఒక కారణం. కథ విన్న దగ్గర నుండీ, ఇప్పటివరకూ ఆవిడ చాల బాగా సపోర్ట్ చేశారు. కథలోని ఎమోషన్స్ కి ఆవిడ బాగా కనెక్ట్ అయ్యారు. నేను అనుకున్నట్లుగానే, ఆవిడ కూడా ప్రతి సీన్ నాచురల్ ఉండాలని కోరుకున్నారు.

 

మీ తదుపరి సినిమాల గురించి ?

 

ఒక స్పోర్ట్స్ డ్రామా అనుకున్నాను. అలాగే రెండు మూడు కథలు కూడా ఉన్నాయి. బట్, నేను ఏ సినిమా తీసిన నిజ జీవితంలో జరిగే సంఘటనలను తీసుకునే, అలాగే అందరికీ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ ను తీసుకునే.. సినిమా చేస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు