పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ పై స్పందించిన ఎన్టీఆర్‌ !

Published on Oct 6, 2018 4:12 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘అరవింద సమేత’ విడుదలకు సమయం దగ్గర పడుతుంది. దాంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. తాజగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా అజ్ఞాతవాసి చిత్రం పై అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్‌ స్పదింస్తూ.. ‘అజ్ఞాతవాసి’ చిత్రం ప్రభావం అరవింద సమేత పై ఉండదు. ఏ దర్శకుడికైనా నటుడికైనా ప్రతీ సినిమా ఓ సరికొత్త ప్రయాణం అనే చెప్పాలి. అంతెందుకు నా కెరీర్‌లో కూడా నాకు ఫ్లాప్స్‌ వచ్చాయి. ఆ తరువాత వెంటనే హిట్లు వచ్చాయి. అందుకే ఎప్పుడైనా ఒక ఫ్లాప్‌ చిత్రం ప్రభావం ఆ తర్వాత చిత్రం పై ఉండదు. ఈ అరవింద సమేత చిత్రం పూర్తిగా త్రివిక్రమ్‌ మార్క్‌ సినిమా’ అని తారక్ తెలిపారు.

కాగా ఇప్పటికే ‘అరవింద సమేత’ చిత్రం పట్ల ఎన్టీఆర్ అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా చాలా ఆసక్తి నెలకొంది. మరి వారి అంచనాలను త్రివిక్రమ్ అందుకోగలడో లేదో చూడాలి. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబు ఇద్దరు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు

సంబంధిత సమాచారం :