నాటికి నేటికీ ధ్రువ తార మీరే – జూ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.!

Published on Jan 18, 2022 10:09 am IST


తెలుగు చలన చిత్ర పరిశ్రమకే వన్నె తెచ్చిన మహనీయ నటుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే విధంగా ఎన్టీఆర్ చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా చిరస్మరణీయం. అందుకే నేటికీ కూడా తెలుగు సినిమా ప్రస్తావన వస్తే మొట్ట మొదటగా స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరునే గుర్తుకొస్తుంది.

మరి నాటి తాతయ్య పోలికలనే పుణికిపుచ్చుకుని మరలా ఆయనే జన్మించారా అన్నట్టుగా మనవడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇపుడు తెలుగు సినిమా దగ్గర బిగ్ స్టార్ట్ అయ్యాడు. అలాగే తనకి కూడా దివంగత ఎన్టీఆర్ పై ఉన్న ప్రేమ కూడా వర్ణించలేనిది. ఎన్నో మార్లు తన తాతయ్య పట్ల ఉన్న ప్రేమని గౌరవాన్ని చెప్పుకొచ్చిన సందర్భాలు కోకొల్లలు.

మరి అలాంటి మహనీయుడి వర్ధంతి నేడు కావడంతో నందమూరి అభిమానులు సహా ఆయన కుటుంబీకులు మరోసారి ఆయన పేరు గుర్తు చేసుకుంటున్నారు. మరి దీనిపై జూ ఎన్టీఆర్ కూడా భావోద్వేగ పోస్ట్ చేయడం జరిగింది. “తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ.. నేటికీ.. ముమ్మాటికీ.. ధ్రువ తార మీరే” మీరే అంటూ ఎన్టీఆర్ చేసిన భావోద్వేగపూరిత పోస్ట్ ఇప్పుడు నందమూరి అభిమానులని మరింత భావోద్వేగపరిచింది.

సంబంధిత సమాచారం :