మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు భారీ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ పట్ల నెలకొన్న హైప్ అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా వదిలిన గ్లింప్స్ తో ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు.
ఈ ఒక్క సినిమా కోసం ఎన్టీఆర్ ఎన్నడూ లేని విధంగా మేకోవర్ అవ్వడం ఒకింత ఫ్యాన్స్ ని చాలా ఇబ్బంది పెట్టింది. అయినప్పటికీ సినిమా కోసం తారక్ ఎంతవరకు అయినా వెళ్లగలడు అనేది తన డెడికేషన్ తో మరోసారి చూపించాడు. ఇందులో ‘లూగర్’ లుక్ కోసం ఇదంతా చేసిన తారక్ ని చూసి మొదట అభిమానులు కొంచెం టెన్షన్ పడ్డారు.
కానీ లేటెస్ట్ లుక్స్ చూసి మాత్రం హమ్మయ్య అనుకుంటున్నారు. ఇప్పుడు మాత్రం తాను స్లిమ్ గానే అయిన్నప్పటికీ ఫ్రెష్ లుక్ లో కనిపిస్తుండడం ఫ్యాన్స్ కి కేజ్రీగా మారింది. దీనితో వారంతా కాస్త కుదుటపడ్డారు. ఇక ఈ ఛేంజ్ తో డ్రాగన్ లో తాను ఎలా కనిపిస్తాడో చూడాలి మరి.



