‘జనతా గ్యారేజ్’ మేనియాలో ‘ఎన్టీఆర్’ అభిమానులు

12th, August 2016 - 11:08:36 AM

janathagarage1
ప్రస్తుతం ‘ఎన్టీఆర్’ అభిమానులంతా ‘జనతా గ్యారేజ్’ మేనియాలో మునిగిపోయున్నారు. నాన్నకు ప్రేమతో వంటి సూపర్ సక్సెస్ తరువాత యంగ్ టైగర్ నటిస్తున్న చిత్రం కావడం, టీజర్లు బాగుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతున్న ఈ చిత్రం ఆడియో వేడుక ఈరోజే హైదరాబాద్ ల్కొని శిల్పకళా వేదికలో జరగనుంది.

దీని కోసం అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పలు చోట్ల భారీ కటౌట్లు, బ్యానర్లు కడుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ‘దేవి శ్రీ ప్రసాద్’ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మొత్తం 6 వైవిధ్యభరితమైన పాటలు ఉంటాయని తెలుస్తోంది. ‘కొరటాల శివ’ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ‘సమంత, నిత్యామీనన్లు’ హీరోయిన్లుగా నటిస్తుండగా మలయాళ సూపర్ స్టార్ ‘మోహన్ లాల్’ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.