బాబాయ్ బాటలోనే తారక్..మరింతమంది అగ్ర తారలు కూడా అండగా.!

Published on Oct 20, 2020 2:04 pm IST

ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల ప్రజలను కరోనా ఎంతలా చిదిమేసిందో తెలిసిందే. ఇక అదంతా చాలదు అన్నట్టుగా ఇప్పుడు వరదలు వారి జీవితాలను మరింత స్థాయిలో ఛిద్రం చేసేశాయి. తెలంగాణా హైదరాబాద్ లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దీనితో మొట్ట మొదటిగా టాలీవుడ్ నుంచినందమూరి నటసింహం బాలకృష్ణ స్పందించి ఏకంగా కోటి 50 లక్షల రూపాయలను తెలంగాణా రాష్ట్ర సంక్షేమ నిధికి అందించారు.

ఇప్పుడు అదే బాబాయ్ బాటలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వరద బాధితులకు అండగా 50 లక్షల రూపాయలను తెలంగాణ సంక్షేమ నిధికి విరాళంగా ఇస్తున్నానని తన ఉదారతను చాటుకొని తెలంగాణ ప్రజలకు ధైర్యం చెప్పారు. మళ్ళీ మన హైదరాబాద్ నగరాన్ని పునర్నిర్మించుకోవాలని అభిప్రాయపడ్డారు. అలాగే తారక్ తో పాటుగా రౌడీ హీరో విజయ్ దేవర కొండ 10 లక్షలు ప్రకటించగా అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ 10 లక్షలు విరాళంగా ఇచ్చినట్టు హారికా హాసిని వారు తెలిపారు.

సంబంధిత సమాచారం :

More