టీఆర్పీ ని పరిగెత్తిస్తున్న తారక్..పెరుగుతున్న తన షో స్పాన్.!

Published on Sep 9, 2021 3:06 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ పక్క సిల్వర్ స్క్రీన్ షూట్ తో పాటుగా స్మాల్ స్క్రీన్ షూట్ కి కూడా బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తన లేటెస్ట్ అండ్ గ్రాండ్ రియాలిటీ షో “ఎవరు మీలో కోటీశ్వరులు” తో లాస్ట్ వీక్ రికార్డు స్థాయి టీఆర్పీ సెట్ చేసిన తారక్ ఈ షో ని తనదైన గ్రేస్ తో గ్రాఫ్ ఎక్కడా పడకుండా రాణిస్తున్నాడు. ఇంకా టీఆర్పీ అయితే స్టాండర్డ్ గా పెంచుతూ పెరిగెత్తిస్తున్నాడట.

మరి లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం యంగ్ టైగర్ ఈ షోకి 20 శాతంకి పైగా వ్యూవర్స్ ని రప్పించారట. దీనిని బట్టి తారక్ మళ్ళీ స్మాల్ స్క్రీన్ పై తన మ్యాజిక్ ని ఏ రేంజ్ లో చూపిస్తున్నాడో మనం అర్ధం చేసుకోవచ్చు.. మరి ప్రస్తుతం తారక్ తన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ “RRR” ని కంప్లీట్ చేసి కొత్త మేకోవర్లోకి మారి కొరటాలతో ప్రాజెక్ట్ కి సన్నద్ధం అయ్యాడు. అలాగే ఈ బిగ్ ప్రాజెక్ట్ నుంచి కూడా పలు ఆసక్తికర కొత్త అప్డేట్ లు రానున్న రోజుల్లో సిద్ధంగా ఉన్నాయి.

సంబంధిత సమాచారం :