భీం రోల్ అతి పెద్ద ఛాలెంజ్ అంటున్న తారక్.!

Published on May 20, 2021 11:03 am IST

మన టాలీవుడ్ మాస్ క్రౌడ్ పుల్లింగ్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. అలా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న తారక్ పుట్టినరోజు నేడు. అందుకే పెద్ద ఎత్తున అతని జన్మదిన వేడుకలు ఫ్యాన్స్ జరుపుకుంటున్నారు. ఇక ఇదిలా ఉండగా తాను నటిస్తున్న లేటెస్ట్ అండ్ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” నుంచి మైండ్ బ్లోయింగ్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు.

మరి ఆ పోస్టర్ ను తాను కూడా లాంచ్ చేస్తూ తారక్ తన ఇంటెన్స్ రోల్ కోసం కాస్త చెప్పారు. తాను చేస్తున్న ఈ రోల్ ను మీకు అందరికీ పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని అలాగే తాను చేస్తున్న ఈ కొమురం భీం పాత్ర తన కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని కూడా తెలిపారు. అయితే ఈ రోల్ లో తారక్ విశ్వరూపం ఎలా ఉంటుందో ఇది వరకే టీజర్ లో చూసాము. షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ తో ప్రతి ఒక్కరిని స్టన్ చేసాడు. మరి ఈ ఫుల్ సినిమాలో ఎలా ఉండనున్నాడో చూడాలి.

సంబంధిత సమాచారం :