తాత ఎన్టీఆర్ కి నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్

Published on Jan 18, 2020 9:55 am IST

జూనియర్ ఎన్టీఆర్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ నేటి ఉదయం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ చేరుకొని ఆయనకు నివాళులు అర్పించారు. నేడు వారి తాతగారైన నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కావడంతో తారక్, కళ్యాణ్ రామ్ ఆయన్ని స్మరించుకున్నారు. ఆయన సమాధిపై పుష్ప గుచ్ఛాలు ఉంచి, కొన్ని నిముషాలు మౌనం పాటించారు. అటు వెండితెర వేలుపుగా, ప్రజల ఆరాధ్య నాయకుడిగా ఎదిగిన ఎన్టీఆర్ 1996 జనవరి 18న హఠాన్మరణం పొందారు.

ఇక ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ విరామంలో జూనియర్ ఎన్టీఆర్ ఈనెల 20 నుండి మొదలుకానున్న లేటెస్ట్ షెడ్యూల్ నందు పాల్గొననున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తుండగా మరో స్టార్ హీరో రాంచరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం జులై 30న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More