ఈ ఒక్క సీన్ తో గ్లోబల్ గా దద్దరిల్లుతున్న జూ. ఎన్టీఆర్ పేరు.!

Published on Jul 19, 2022 4:04 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మన తెలుగు రాష్ట్రాలు సహా సౌత్ ఇండియా మార్కెట్ లో భారీ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. మరి నెక్స్ట్ దర్శకుడు కొరటాలతో చేయబోయే సినిమా జస్ట్ అనౌన్సమెంట్ తన వాయిస్ తోనే పాన్ ఇండియా లెవెల్లో ప్రకంపనలు రేపాడు. మరి దీనికి ముందు చేసిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా “రౌద్రం రణం రుధిరం” సినిమాలో మెస్మరైజింగ్ రోల్ కొమరం భీమ్ తో ఇంటర్నేషనల్ వైడ్ భారీ స్థాయి రెస్పాన్స్ ని కొల్లగొడుతున్నాడు.

ఇక లేటెస్ట్ గా అయితే అన్నిటినీ మించి ఇండియన్ సినిమా దగ్గర ఏ హీరోకి కూడా రాని విధంగా ఒక్క వీడియోతో సెన్సేషనల్ రీచ్ ని తారక్ అందుకున్నాడు. RRR సినిమాలో ఎన్టీఆర్ ఇంటర్వెల్ బ్యాంగ్ మాసివ్ ఎంట్రీ కి ఫారినర్స్ స్టన్ అవుతున్నారు. దీనితో దీనికి గంటల్లోనే భారీ మిలియన్ వ్యూస్ సొంతం అవ్వగా అనేక మంది హాలీవుడ్ ప్రముఖులు అందులో ఎన్టీఆర్ పవర్ ఫుల్ ఎంట్రీ కోసం ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.

అలాగే మరికొందరు హాలీవుడ్ ప్రముఖులు అయితే ఎన్టీఆర్ ని సూపర్ హీరో అని కూడా అంటున్నారు. మరి ఈ లెవెల్లో అయితే ఎన్టీఆర్ పేరు గ్లోబల్ గా దద్దరిల్లితుంది.. మరి వీటితో పాటుగా ఇలాంటి క్రేజీ సీక్వెన్స్ ని డిజైన్ చేసిన దర్శకుడు రాజమౌళి అలాగే యాక్షన్ యూనిట్ పై కూడా అనేక ప్రశంసలు వస్తున్నాయి.

సంబంధిత సమాచారం :