తారకరాముని, లవకుశుల ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయిగా.

Published on Jun 15, 2019 12:30 pm IST

ఎన్టీఆర్ ఓ పక్క “ఆర్ ఆర్ ఆర్” షూటింగ్ షెడ్యూలులో బిజిగా గడుపుతూనే తీరికదొరికినప్పుడల్లా కొంత సమయాన్ని తన కుటుంబానికి కేటాయిస్తున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతుంది. దీనితో తీరికి దొరికినప్పుడల్లా ఎన్టీఆర్ ఇంట్లో భార్య పిల్లలతో గడుపుతున్నాడు. గత సంవత్సరం ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రశాంతి రెండవ కుమారుడుకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. నిన్న ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ రామ్ కి ఏడాది వయసు రావడంతో ఎన్టీఆర్, తన ఇద్దరు కొడుకుల ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఆ విషయాన్ని తన ఫ్యాన్స్ తో పంచుకున్నారు.

ఇద్దరు కొడుకుల వలన ఎన్టీఆర్ కి కలుగుతున్న పుత్రోత్సహం చూస్తుంటే ముచ్చటేస్తుంది. అభయ్ రామ్,భార్గవ్ రామ్ ల ఫోటోని చూస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ లవకుశులు వలే ఉన్నారని తెగమురిసిపోతున్నారు. నిన్నటి నుండి ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More