యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన గత సినిమాల లిస్టులో ఒక్క బాద్షా తప్ప మిగతా ఏ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. అలాగే గత రెండు సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద ఫ్లాప్స్ గా నిలిచాయి. అలాగే ఎన్.టి.ఆర్ కూడా తన ఫ్యాన్స్ కి చాలా దూరంగా ఉన్నాడు మరియు ఎన్.టి.ఆర్ కి తన సొంత ఫ్యామిలీ మరియు టిడిపి పార్టీ యూత్ కి కూడా చాలా దూరంగా ఉన్నాడనే వార్తలు ఉన్నాయి.
తాజాగా ఫిలిం నగర్లో వినిపిస్తున్న సమాచారం మరియు ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక తెలిపిన కథనం ప్రకారం ఎన్.టి. ఆర్ త్వరలోనే తన అభిమానులను ప్రత్యక్షంగా కలవడం కోసం ఓ ఫ్యాన్ మీట్ ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫ్యాన్స్ మీట్ కి అభిమానులతో పాటు టిడిపి పార్టీ యూత్ కాడర్ ని కూడా ఆహ్వానించనున్నాడు. ఈ ఫ్యాన్ మీట్ లో ఎన్.టి.ఆర్ స్వయంగా అభిమానులతో మాట్లాడి వారు ఏం కోరుకుంటున్నారు, ఎలా తనని చూడాలనుకుంటున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకోనున్నాడు. అలాగే ఓ అక్కడికి వచ్చిన వారందరితోనూ స్పెషల్ ఫోటో షూట్ కూడా ప్లాన్ చేస్తున్నాడు.
మరి ఈ ఫ్యాన్ మీట్ ఎన్.టి.ఆర్ కెరీర్లో తను కోరుకుంటున్న మార్పును తీసుకోస్తుందేమో చూడాలి..


