ఎన్టీఆర్ ‘అరవింద’ ట్రైలర్ కు విశేష స్పందన !

Published on Oct 3, 2018 12:33 pm IST

త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన పూర్తి యాక్షన్ చిత్రం ‘అరవింద సమేత’. నిన్న మంగళవారం జరిగిన ప్రీరిలీజ్‌ ఈవెంట్ లో ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ ను రిలీజ్ చేశారు, ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తోంది. కేవలం 12 గంటల్లోనే 50లక్షల మందికి పైగా ఈ ట్రైలర్‌ను చూశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులకు విపరీతంగా ఆకట్టుకుంటుంది. అలాగే తారక్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులను కూడా ఈ ట్రైలర్ బాగా అలరిస్తోంది.

అయితే నిన్న ఈవెంట్ లో ఎన్టీఆర్ ఇచ్చిన కన్నీటి భావేద్వేగమైన స్పీచ్ కూడా.. అభిమానుల హృదయాలను కదిలించిన విషయం తెలిసిందే. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబు ఇద్దరు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

ట్రెయిలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :