నారప్ప విడుదల పై రానున్న క్లారిటీ!

Published on Jul 9, 2021 9:49 pm IST

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, ప్రియమణి హీరో, హీరోయిన్ లుగా నటించిన తాజా చిత్రం నారప్ప. ఈ చిత్రం త్వరలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రం నుండి చలాకి చిన్నమ్మి పాటను జూలై 11 వ తేదీన ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఈ ప్రకటన తో ఈ చిత్రం ఓటిటి ద్వారా విడుదల అవుతుందా లేక థియేటర్ల లో బొమ్మ రిలీజ్ అవుతుందా అనే దాని పై క్లారిటీ రానుంది.

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మళ్ళీ పునః ప్రారంభం నిర్ణయం తో నారప్ప ను థియేటర్ల లో విడుదల చేస్తున్నారు అంటూ పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే జూలై 11 న విడుదల కానున్న పాట తో దీని పై క్లారిటీ రానుంది. నారప్ప చిత్రం విక్టరీ వెంకటేష్ కెరీర్ లో 74 వ చిత్రం. అయితే తమిళం లో సూపర్ హిట్ అయిన అసురన్ చిత్రానికి నారప్ప రీమేక్. అయితే ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :