దీపావళి కి మరింత స్టైలిష్ గా, ఎనర్జిటిక్ గా జూనియర్ ఎన్టీఆర్ షో..!

Published on Nov 3, 2021 1:00 pm IST

బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఎవరు మీలో కోటీశ్వరులు దీపావళి పండుగ కి సరికొత్తగా ముస్తాబు అయ్యింది. ఈ పండుగ కి ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎన్టీఆర్ షో లో దర్శనం ఇవ్వనున్నారు. ఒకరు థమన్ కాగా, మరొకరు దేవీ శ్రీ ప్రసాద్.

అయితే ఈ దీపావళి షో కి జూనియర్ ఎన్టీఆర్ మరింత స్టైలిష్ గా రెడీ అయ్యారు. ఈ షో కి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలో జూనియర్ ఎన్టీఆర్ మరింత ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. ఈ షో జెమిని టీవీ లో రేపు రాత్రి 8:30 గంటలకు ప్రసారం కానుంది. ఈ షో కి అటు ప్రేక్షకులు, ఇటు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :