మళ్లీ స్టైలిష్ లుక్‌లోకి మారబోతున్న తారక్..!

Published on Aug 5, 2021 3:00 am IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌ కొరటాల శివ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ పూర్తైన తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతుంది. అయితే ప్రతి సినిమాలో పాత్రకి తగ్గట్టు మేకోవర్ ఛేంజ్ చేసుకునేందుకు జూనియర్ ఎన్టీఆర్‌ ఎప్పుడూ సిద్దంగా ఉంటారు.

అయితే ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో కొమురం భీమ్‌ పాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్‌ కాస్త బరువు పెరిగినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ పాత్రలో ఎన్టీఆర్‌ ఆదివాసీ బిడ్డగా కాస్త రఫ్ లుక్‌లోనే కనిపిస్తున్నాడు. అయితే కొరటాల శివతో చేస్తున్న తదుపరి సినిమా కోసం రెగ్యులర్‌గా కన్నా కూడా ఎన్టీఆర్‌ కాస్త సన్నబడాలట. ఆర్‌ఆర్‌ఆర్‌ షూట్ అయిపోయిన వెంటనే తారక్ స్పెషల్‌ వర్కవుట్స్‌తో, సరైన్ డైట్ ఫాలో అయ్యి బరువును తగ్గించుకుని మళ్లీ స్టైలిష్ లుక్‌లోకి మారబోతున్నాడని సమాచారం. ఇదిలా ఉంటే కొరటాల దర్శకత్వంలో చేసిన ‘జనతా గ్యారేజ్‌’లో కూడా ఎన్టీఆర్‌ స్టైలిష్ లుక్‌లో కనిపించారు. మరీ ఈ చిత్రంలో తారక్ లుక్‌ని కొరటాల ఎలా చూపిస్తాడో చూడాలి మరీ.

సంబంధిత సమాచారం :