ఈ నెల 20 వరకు ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరులు షూటింగ్?

Published on Jul 8, 2021 7:00 pm IST

జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా సైతం రాణిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అటు నటుడిగా కొనసాగుతూనే సమయం ఉన్న ప్రతిసారీ కొన్ని షో లకు వ్యాఖ్యాత గా వ్యవహారించడం మనం చూశాం. అయితే తాజాగా మీలో ఎవరు కోటీశ్వరులు అనే కార్యక్రమం కోసం జూనియర్ ఎన్టీఆర్ సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే జెమిని టీవీ లో ప్రసారం కానున్న ఈ కార్యక్రమం ఎంతో ప్రాచుర్యం పొందిన కౌన్ బనేగా కరోడ్ పతి లా ఉంటుంది అని చెప్పాలి.

అయితే ఈ షో కోసం జూనియర్ ఎన్టీఆర్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దాదాపు 10 కోట్ల రూపాయలకు పైగా ఈ కార్యక్రమం కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నెల 20 వ తేదీ వరకు ఎన్ని సన్నివేశాలు పూర్తి అయితే అన్ని సన్నివేశాలు చిత్రీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మరొక పక్క రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం లో కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :