మరో సెన్సేషనల్ రికార్డును సెట్ చేసిన తారక్.!

Published on Nov 29, 2020 9:02 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తీస్తున్న భారీ పీరియాడిక్ విజువల్ ట్రీట్ “రౌద్రం రణం రుధిరం”. అయితే ఇటీవలే తారక్ పై డిజైన్ చేసిన టీజర్ “రామరాజు రాజు ఫర్ భీం” మన టాలీవుడ్ లోనే ఏ సీనియా టీజర్ కు కూడా రాని భారీ స్థాయి రెస్పాన్స్ ను అందుకొని పలు నెవర్ బిఫోర్ రికార్డులు సెట్ చేసింది.

అదంతా మాత్రం తారక్ మ్యానియా అనే చెప్పాలి. చాలా ఏళ్ల నిరీక్షణ అనంతరం ఊరిస్తూ వచ్చిన టీజర్ ఇది దీనితో ఎక్కడ లేని రికార్డులు ఫ్యాన్స్ అందించారు. అలా టాలీవుడ్ లో ఫస్ట్ ఎవర్ 1 మిలియన్ లైక్డ్ టీజర్ గా నిలవడంతో పాటుగా ఫాస్టెస్ట్ వ్యూస్ అందుకున్న టీజర్ గా కూడా నిలిచింది.

ఇదే కాకుండా ఒక టీజర్ లు లక్ష కామెంట్స్ రావడం కూడా ఎప్పుడు జరగలేదు కానీ అది కూడా ఈ టీజర్ తో కొట్టారు. ఇప్పుడు మరో లక్ష యాడ్ చేసి రెండు లక్షల కామెంట్స్ తో ఇంకో రికార్డు సెట్ చేసారని తారక్ అభిమానులు అంటున్నారు. దీనితో తారక్ ఖాతాలో మరో సెన్సేషనల్ రికార్డు పడ్డట్టు అయ్యింది.

సంబంధిత సమాచారం :

More