ఎన్టీఆర్ మలయాళ భాషలో కూడా.. !

Published on Apr 2, 2020 8:08 pm IST

రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రాబోతున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’. అయితే ఈ సినిమా కోసం తార‌క్ తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, కన్నడ భాష‌ల్లో డ‌బ్బింగ్ చెప్ప‌బోతున్నారు. ఇప్పటికే నాలుగు భాష‌లను ఎన్టీఆర్ నేర్చుకున్నాడు. చరణ్ బర్త్ డే వీడియోకి ఎన్టీఆర్ ఒక్క మలయాళ భాషలో తప్ప అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పారు. కాగా తాజాగా మ‌ల‌యాళ భాష కూడా ఎన్టీఆర్ నేర్చుకుంటున్నాడట. సినిమాలో మలయాళ వర్షన్ కి కూడా ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పబోతున్నారు.

ఇక ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా, తారక్ కొమరం భీంలా నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘బాహుబలి’ సిరీస్ అనంతరం రాజమౌళి చేస్తున్న ప్రాజెక్ట్ కావడం, పైగా ఇద్దరు స్టార్ హీరోలతో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో అత్యున్నత భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :

X
More