‘ఉస్తాద్ ఉగాది’కి ఇక 3 రోజులే.. బుకింగ్స్ లింక్ ఇదే !

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తన హిట్ దర్శకుడు హరీష్ శంకర్ తో చేసిన సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్”. పెర్ఫార్మెన్స్ బద్దలై పోద్ది.. ఉగాది అదిరిపోద్ది. ఉస్తాద్ ఉగాది కోసం కేవలం ఇక 3 రోజులు మాత్రమే ఉన్నాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 19 మార్చి, 2026న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఐతే, ఇప్పటికే.. ఆంధ్రప్రదేశ్‌లో బుకింగ్‌లు ప్రారంభం అయ్యాయి, నైజాంలో కూడా బుకింగ్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి

ఇక ఈ సినిమాలో ఎలాంటి రాజకీయ అంశాలు ఉండవని, పవన్‌కల్యాణ్‌ను ఎంటర్‌టైన్‌మెంట్‌ మోడ్‌లో చూస్తారని దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా అందాల భామలు శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను ఉగాది స్పెషల్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.

“ఉస్తాద్ భగత్ సింగ్” మూవీ టికెట్స్ బుకింగ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version