జస్ట్ లవ్ అండ్ మోర్ లవ్ ‘నమ్రతా’ – మహేష్ బాబు

Published on Jan 22, 2020 11:13 am IST

సూపర్‌స్టార్‌ మహేష్ బాబు జీవితంలో అతి ముఖమైన వ్యక్తి ఆయన సతీమణి ‘నమ్రతా శిరోద్కర్‌’ అని ఇప్పటికే మహేష్ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. పైగా మహేష్ పర్సనల్ లైఫ్ కి సంబంధించి, అలాగే ఆయన ప్రొఫిషనల్ లైఫ్ కి సంబంధించి అన్ని విషయాల్లో ఎప్పుడూ తోడుగా ఉంటూ భార్యగా ఆమె మహేష్ కి అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారు. కాగా ఈ రోజు నమ్రతా శిరోద్కర్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన సతీమణికి సోషల్ మీడియా ద్వారా బర్త్‌ డే విషెస్‌ తెలియజేసారు.

మహేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. ‘నేను ఎంతగానో ప్రేమిస్తోన్న నా ఇల్లాలికి నా సతీమణికి పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని ‘జస్ట్ లవ్ అండ్ మోర్ లవ్ నమ్రతా’ అని మహేష్ ట్వీట్‌ చేస్తూ నమత్ర ఫొటోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ను మహేష్ బాబు అభిమానులు పెద్ద ఎత్తున లైక్స్ అండ్ షేర్ చేస్తున్నారు. ఇక మహేష్‌ బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ తో సూపర్ హిట్ గా నిలిచింది.

సంబంధిత సమాచారం :