ఇంటర్వ్యూ : రంజిత్ – సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉంటుంది !
Published on Feb 21, 2018 2:09 pm IST

‘నువ్వు నేను ఒకటవుదాం’ సినిమాతో హీరోగా పరిచయమైన నటుడు రంజిత్ రెండవ చిత్రం ‘జువ్వ’. ఈ నెల 23న ఈ సినిమా రిలీజ్ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) మీ నైపథ్యం గురించి రెండు మాటలో చెప్పండి ?
జ) మాది వైజాగ్. నా మొదటి సినిమా ‘నువ్వు నేను ఒకటవుదాం’. ‘జువ్వ’ నా రెండో సినిమా. సొంత నిర్మాణంలో చేశాం.

ప్ర) ఇంతకీ సినిమా ఎలా ఉండబోతోంది ?
జ) అవుట్ ఫుట్ చూశాను. చాలా బాగా వచ్చింది. ఇదొక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఇందులో రొమాన్స్, యాక్షన్, మంచి పాటలు, ఫన్ అన్నీ ఉంటాయి. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది.

ప్ర) సినిమా బడ్జెట్ అనుకున్నదానికంటే ఎక్కువైందని అంటున్నారు. ఎక్కడ ఎక్కువ ఖర్చు చేశారు ?
జ) ముందు స్క్రిప్ట్ ఓకే చేశాక ఒక బడ్జెట్ అనుకున్నాం. కానీ షూటింగ్ సమయానికి అది కాస్త ఎక్కువైంది. కానీ అనవసరంగా ఎక్కడా ఖర్చు పెట్టలేదు. పెట్టిన బడ్జెట్ కి తగ్గట్టే అవుట్ ఫుట్ వచ్చింది.

ప్ర) మీ దర్శకుడు త్రికోటి గురించి చెప్పండి ?
జ) డైరెక్టర్ త్రికోటి ఇది రెండవ సినిమా. ఆయన మొదటి చిత్రం ‘దిక్కులు చూడకు రామయ్య’ మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరహాలోనే ఈ సినిమా కూడ ఎంటర్టైనింగా ఉంటుంది. త్రికోటిగారికి నాలెడ్జ్ ఎక్కువ. షూటింగ్ సమయంలో ఆయన వద్ద నుండి చాలా నేర్చుకున్నాను.

ప్ర) ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది ?
జ) ఇందులో నా పేరు రానా. ఎప్పుడూ జాలీగా, సరదాగా ఉండే కుర్రాడి పాత్ర. ఫైట్స్, రొమాన్స్, ఫన్ అని సమయాల్లోనూ జాలీగానే ఉంటుంది.

ప్ర) మీకు హీరోగా రాణించాలని ఎప్పుడనిపించింది ?
జ) చిన్నప్పటి నుండి నాకు సినిమాలంటే చాలా ఇష్టం. నన్ను నేను హీరోగా చూసుకోవాలనేది నా కోరిక. చాలా కాలం ఒక్కడినే ట్రై చేశాను కూడ.

ప్ర) మీ సినిమాకి కీరవాణి సంగీతం అందివ్వడం ఎలా ఉంది ?
జ) కీరవాణి లాంటి పెద్ద సంగీత దర్శకుడు నా సినిమాకు మ్యూజిక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయనిచ్చిన సంగీతం చాలా గొప్పగా ఉంది. రీ రికార్డింగ్ అయితే సినిమాకే హైలెట్ అవుతుంది.

ప్ర) చిరంజీవిగారు టీజర్ లాంచ్ చేయడం పై మీ స్పందన ?
జ) చిరంజీవిగారు అడగ్గానే ఒప్పుకుని టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చూసి నాది ఫోటోజెనిక్ ఫేస్ అని మెచ్చుకున్నారు.

ప్ర) మీ నిర్మాత గురించి చెప్పండి ?
జ) మా అన్నయ్య డా.భరత్ ఈ సినిమాని చాలా ఇష్టపడి నిర్మించారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అన్ని సమకుర్చారు. సినిమా ఇంత గొప్పగా రావడానికి ఆయనే ప్రధాన కారణం.

ప్ర) ఇకపై ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు ?
జ) నాకైతే స్పోర్ట్స్ డ్రామాల్లో నటించాలని ఉంది. అలాగే ఫ్రెష్ లవ్ స్టోరీలన్నా ఇష్టమే.

 
Like us on Facebook