పోలీస్ గా మారిన చంద్రముఖిని చూడు…!

Published on Jul 23, 2019 4:37 pm IST

నటి జ్యోతిక 2016 లో హీరో సూర్యను వివాహం చేసుకున్న తరువాత గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వచ్చారు.గత కొద్దికాలంగా ఆమె లేడీ ఓరియెంట్ చిత్రాలలో నటిస్తూ వస్తున్నారు. 36 వయధినిలే,మగలీర్ మట్టుమ్,నాచ్చియార్,కాట్రిన్ మోఝి వంటి చిత్రాలలో జ్యోతికా ప్రధాన పాత్రలో కనిపించారు. తాజాగా ఆమె “రాత్ససి” చిత్రంలో టీచర్ గా నటించారు. “రాత్ససి” చిత్రం లో ప్రభుత్వ విద్యావ్యవస్థ పై మరియు ప్రభుత్వ ఉపాధ్యాయులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో సినిమా ఆపివేయాలని ఉపాధ్యాయులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.

కాగా జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన “జాక్ పాట్” చిత్ర ట్రైలర్ నేడు విడుదలైంది. పోలీస్ ఆఫీసర్ గా జ్యోతిక పెరఫార్మెన్సు అదిరిపోయింది. “జాక్ పాట్” ట్రైలర్ లో కామెడీ,యాక్షన్, డాన్స్ లతో జ్యోతిక అద్భుత నటన కనపరిచారు. సీనియర్ హీరోయిన్ రేవతి కూడా జ్యోతికతో సమానమైన పాత్ర చేస్తున్నట్లు సమాచారం. గతంలో జ్యోతిక “నాచ్చియార్” చిత్రం సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేశారు. ఈ చిత్రంలో మాత్రం కొంచెం కామెడీగా సాగే పోలీస్ పాత్రలో జ్యోతిక నటించినట్లున్నారు.

ఆనంద్ రాజ్, కమెడియన్ యోగి బాబు నటిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ దర్శకత్వం వహించగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కానుంది.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

X
More