సీనియర్ హీరోయిన్ జ్యోతిక నటిస్తున్న తాజా చిత్రం ‘కాట్రిన్ మొళి’. బాలీవుడ్ లో విజయం సాధించిన ‘తుమ్హారీ సులు’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతుంది ఈచిత్రం. రాధా మోహన్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈచిత్రం దసరా బరి నుండి తప్పుకుంది. మొదటగా ఈచిత్రాన్ని అక్టోబర్ 18న విడుదలచేస్తామని ప్రకటించారు.
కానీ ఇప్పుడు అక్టోబర్ 17న ధనుష్ నటించిన ‘వడచెన్నై’ అలాగే 18న విశాల్ ‘పందెంకోడి 2’ చిత్రాలు విడుదలవుతుండంతో వాటితో పోటీ ఎందుకని ఈచిత్రాన్ని వాయిదా వేశారు. తాజాగా నవంబర్ నెలలో ఈచిత్రాన్ని విడుదలచేయనున్నారని సమాచారం. ప్రముఖ తెలుగు నటి మంచు లక్ష్మి ఈచిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తుంది.


