ఓటిటి సమీక్ష: ‘కాఫిర్’ హిందీ చిత్రం (తెలుగు డబ్) జీ5లో ప్రసారం

ఓటిటి సమీక్ష: ‘కాఫిర్’ హిందీ చిత్రం (తెలుగు డబ్) జీ5లో ప్రసారం

Published on Apr 8, 2025 8:00 PM IST

kaafir Movie Review In Telugu

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : ఏప్రిల్ 4, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : మోహిత్ రైనా, దియా మీర్జా, ఉమర్ షరీఫ్, దిశిత జైన్, దారా సందు తదితరులు.
దర్శకత్వం : సోనమ్ నైర్
నిర్మాణం : ఆల్కెమీ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్
సంగీతం : రాజు సింగ్, రవి సింఘల్
సినిమాటోగ్రఫీ : ప్రతీక్ షా
ఎడిటర్ : యశశ్విని వై.పి
సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

రీసెంట్ గా ఓటిటిలో ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మొదట వెబ్ సిరీస్ తర్వాత దానిని సినిమాగా మార్చిన చిత్రం ‘కాఫిర్’ కూడా ఒకటి. జీ5లో పాన్ ఇండియా భాషల్లో అందుబాటులో ఉన్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఈ చిత్రం 1998 నుంచి 2005 మధ్య జరిగిన కొన్ని యదార్ధ సంఘటనలు ఆధారంగా తెరకెక్కించబడింది. ఆ సమయంలో పాకిస్తాన్ కి చెందిన ఓ యువతి కైనాజ్ అక్తర్ (దియా మీర్జా) తన వైవాహిక జీవితంలో వచ్చిన కలత రీత్యా ఆత్మ హత్య చేసుకోవాలి అనుకుంటుంది. ఆ ప్రయత్నంలో భారత్ సరిహద్దు ప్రాంతంలో కొందరు ఉగ్రవాదులని భారత సైన్యం మట్టుబెడతారు. ఈ సమయంలోనే ఈమె నదీ ప్రవాహంలో కొట్టుకొస్తుంది. దీనితో ఆమెని కూడా ఉగ్రవాది అనుకొని భారత సైన్యం జైల్లో పెడతారు. ఇంకోపక్క రిపోర్టర్ అయ్యిన వేదాంత్ రాథోడ్ (మోహిత్ రైనా) ఈమె కోసం తెలుసుకొని ఆమెపై స్పెషల్ స్టోరీ కవర్ చేయాలి అనుకుంటాడు. ఈ నేపథ్యంలో ఆమె కోసం తాను ఏం తెలుసుకున్నాడు? చెయ్యని తప్పుకి అన్నేళ్లు జైల్లో ఉన్న ఆమె మళ్ళీ తన మాతృ భూమికి చేరుకుంటుందా లేదా? చేరుకునే సమయంలోనే ఆమెకి చట్టబద్ధంగా ఎదురైన సవాళ్లు ఏంటి? వేదాంత్ కి కైనాజ్ కి ఉన్న చిన్న కనెక్షన్ ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమా ఇది వరకే ఒక హిట్ వెబ్ సిరీస్ అయినప్పటికీ దీనిని సినిమాగా మళ్ళీ ఎడిట్ చేసి పలు భాషల్లో అందించడం అనేది మంచి విషయం అని చెప్పవచ్చు. చాలా నిజ జీవిత సంఘటనలు చాలా మందికి తెలియవు అలాంటివి తెలుసుకున్నప్పుడు ఒకింత ఆడియెన్స్ కి కూడా ఒక రకమైన కుతూహలం ఏర్పడుతుంది. అదే ఈ సినిమా చూసినపుడు కూడా ఆడియెన్స్ కి అనిపించవచ్చు.

ఇటీవల వచ్చిన తండేల్ లో చూసుకున్నా కూడా పొరపాటున భారత సముద్ర జలాలు నుంచి పాకిస్తాన్ సముద్ర జలాలు లోకి వెళ్లి జైలు శిక్ష అనుభవించినవారి కోసం చాలా మంది తెలుసుకున్నారు. ఇలానే పాకిస్తాన్ నుంచి కూడా ఎంతోమంది అమాయకులు మన దగ్గరా ఎన్నో ఏళ్ళు జైల్లో మగ్గినవారు కూడా లేకపోలేరు. అలాంటి ఓ అమ్మాయి కథనే సినిమాగా మలచడం బాగుంది.

మంచి ఎమోషన్స్ లోనే కాకుండా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ లు టర్నింగ్ లతో కూడా ఈ సినిమా ఎంగేజింగ్ గా సాగుతుంది. వెబ్ సిరీస్ ని సినిమాగా మలచడం మూలాన సగానికి చేరుకునేసరికి సినిమా అయిపోయింది అనిపిస్తుంది కానీ అక్కడ నుంచి కూడా మరో పాయింట్ తో కొనసాగడం అనేది ఆడియెన్స్ ని ఎంగేజ్ చేస్తుంది. ఇక వీటితో పాటుగా ఇద్దరు మెయిన్ లీడ్ నటీనటులు మోహిత్ రైనా, దియా మీర్జాలు సాలిడ్ పెర్ఫామెన్స్ లు అందించారు.

ఇది వరకు మోహిత్ ఇలాంటి నిజ జీవిత సంఘటనల సిరీస్ లో నటించారు. ఈ కాఫిర్ తన నుంచి మరో మంచి అటెంప్ట్ అని చెప్పవచ్చు. అలాగే దియా మీర్జా కూడా తన పాత్ర చాలా బాగా చేశారు. ఆమె పాత్రలోని అమాయకత్వం, ఇతర ఎమోషన్స్ ని ఆమె బాగా పండించడం జరిగింది. అలాగే వీరిద్దరి చుట్టూ తిరిగే కోర్ట్ డ్రామా సహా పలు ఎమోషనల్ సన్నివేశాలు, అలాగే మోహిత్, దిశిత జైన్ నడుమ కొన్ని సన్నివేశాలు క్యూట్ గా హత్తుకునేలా ఉంటాయి. ఇక వీరితో పాటుగా ఇతర నటీనటులు అంతా మంచి నటన కనబరిచారు.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రాన్ని మొదటి సగం బాగా చాలా ఇంట్రెస్టింగ్ గా మంచి కథనంలో నడిపించినప్పటికీ మలి సగం మాత్రం కొంచెం స్లోగా సాగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇదే నెమ్మదితనం ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ స్టార్ట్ అయ్యి ముగిసే వరకు కూడా కొనసాగుతుంది. మధ్యలో కొన్ని సన్నివేశాలు బాగున్నాయి కానీ ఈ స్లో కథనం అనేది ఒకింత మైనస్ అని చెప్పక తప్పదు. అలాగే క్లైమాక్స్ పోర్షన్ లో నిర్మాణ విలువలు కొంచెం వీక్ గా కనిపిస్తాయి.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. మొదట సిరీస్ అయినప్పటికీ సినిమాగా బాగా ఎడిట్ చేసి తీసుకొచ్చారు. ఒక్క సెకండాఫ్ వరకు కొంచెం కథనం ఫాస్ట్ గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. తప్ప ఇంకో వంకకి తావు లేకుండా కథనం నడిచింది. అలాగే మ్యూజిక్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. కానీ కెమెరా వర్క్ లో సినిమా మరీ డార్క్ గా కనిపిస్తుంది. తెలుగు డబ్బింగ్ డీసెంట్ గా ఉంది. భవాని అయ్యర్ స్క్రీన్ ప్లే బాగుంది. సోనమ్ నైర్ దర్శకత్వం బాగా చేశారు. ఒక్క సెకండాఫ్ కథనం స్లో వరకు పక్కన పెడితే టెక్నీకల్ టీం వర్క్ అంతా మెప్పిస్తుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘కాఫిర్’ చిత్రం మంచి ఎమోషనల్ అండ్ ఇంట్రెస్టింగ్ డ్రామాలు చూడాలి అనుకునేవారికి ఓటిటి మంచి ఛాయిస్ అవుతుంది అని చెప్పవచ్చు. దానికి మించి నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరకెక్కించిన ఓటిటి కంటెంట్ చూడాలి అనుకునేవారికి అయితే ఈ చిత్రం మరింత మెప్పించవచ్చు. ఒక్క సెకండాఫ్ లో అక్కడక్కడా స్లోగా సాగే కథనం మినహాయిస్తే ఈ సినిమా ఓటిటిలో తప్పకుండా ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు