సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కాలా’ చిత్రం సెన్సార్ పనుల్ని ముగించుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేశారు. అలాగే సెన్సార్ సమయంలో సభ్యులు మొత్తం 14 సెట్స్ చెప్పినట్టు తెలుస్తోంది. సినిమాలో వయోలెన్స్ ఎక్కువగా ఉండటం మూలానే ఈ కట్స్ పడ్డాయట.
ఇకపోతే ముందుగా ప్రకటించిన విడుదల తేదీ ఏప్రిల్ 27పై ఇంకా ఖచ్చితమైన క్లారిటీ రాలేదు. ధనుష్ స్వయంగా నిర్మించితిన్ ఈ చిత్రాన్ని పా.రంజిత్ డైరెక్ట్ చేయగా లైకా ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత రజనీ నుండి వస్తున్న మొదటి సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచలున్నాయి.


