‘కాలా’ కమర్షియల్ సినిమా మాత్రమే కాదన్న రజనీ !

‘కాలా’ కమర్షియల్ సినిమా మాత్రమే కాదన్న రజనీ !

Published on Jun 5, 2018 8:58 AM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కాలా’ చిత్రం ఈ నెల 7వ తేదీన తమిళంతో పాటు తెలుగులో కూడ భారీ ఎత్తున విడుదలకానున్న సంగతి తెలిసిందే. అందుకే చిత్ర యూనిట్ నిన్న సాయంత్రం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించింది. ఈ వేడుకలో రజనీకాంత్, ధనుష్ స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా రజనీ మాట్లాడుతూ సినిమాను రెండు సార్లు చూశానని, చాలా బాగా వచ్చిందని ధీమా వ్యక్తం చేశారు.

అలాగే ఇది కేవలం కమర్షియల్ సినిమా మాత్రమే కాదని మంచి సోషల్ మెసేజ్ ఉన్న సినిమా అని అన్నారు. తమిళ ప్రేక్షకులు తనపై ఎంతటి అభిమానాన్ని చూపుతారో తెలుగువారు కూడ అదే స్థాయి అభిమానాన్ని చూపుతున్నారని, అందరికీ నా కృతజ్ఞతలని అన్నారు. పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో నిర్మాత దిల్ రాజు విడుదలచేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు