‘కాలా’ ప్రీ రిలీజ్ వేడుకకు రంగం సిద్ధం !
Published on May 24, 2018 11:21 am IST

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కాలా’ చిత్రం జూన్ 7వ తేదీన భారీ ఎత్తున విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర ఆడియో వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఇప్పుడు ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్లో పాన్ చేశారు చిత్ర టీమ్. రజనీ సినిమాలకు తెలుగునాట కూడ మంచి క్రేజ్ ఉండంతో ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్లో జరుపుతున్నారు.

ఈ వేడుక ఈ నెల 29న నగరంలోని నోవాటెల్ హోటల్లో ఘనంగా జరగనుంది. తమిళంతో పాటు తెలుగులో కూడ ఒకేసారి ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ విడుదలచేస్తోంది. ధనుష్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ప్రతినాయకుడిగా నటించారు. దర్శకుడు పా.రంజిత్ ఈ చిత్రాన్ని ముంబై బ్యాక్ డ్రాప్లో రూపొందించారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook