విడుదల తేదీని ఖరారు చేసుకున్న జ్యోతిక చిత్రం !

Published on Oct 29, 2018 1:42 pm IST

సీనియర్ హీరోయిన్ జ్యోతిక నటిస్తున్న తాజా చిత్రం ‘కాట్రిన్ మొళి’ ఎట్టకేలకు విడుదలకు సిద్దమవుతుంది. ఈచిత్రం మొదటగా దసరా కు విడుదల కావల్సి ఉండగా అదే సమయంలో ధనుష్ నటించిన ‘వడచెన్నై’ అలాగే విశాల్ ‘పందెంకోడి 2’ చిత్రాలు విడుదలవ్వడంతో వాటితో పోటీ ఎందుకని ఈచిత్రాన్ని వాయిదా వేశారు.

తాజాగా నవంబర్ 16న ఈచిత్రాన్నిప్రేక్షకులముందుకు తీసుకరానున్నారు. తెలుగు నటి మంచు లక్ష్మి ఈచిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తుంది. బాలీవుడ్ లో విజయం సాధించిన ‘తుమ్హారీ సులు’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్నా ఈ చిత్రానికి రాధా మోహన్ దర్శకత్వం వహిస్తుండగా క్రియేటివ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం :