‘రోబో’ రికార్డును కొల్లగొట్టిన ‘కబాలి’!

25th, July 2016 - 04:16:16 PM

kabali
సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన ‘కబాలి’ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే. సినిమాకు మొదటి రోజునుంచే నెగటివ్ టాక్ వచ్చినా కూడా రజనీ సినిమా కోసం ఎన్నో నెలలుగా ఎదురుచూసిన అభిమానులంతా చూస్తూ ఉండడంతో కలెక్షన్స్ మాత్రం బాగానే ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ సినిమా హిందీ వర్షన్‌కు కూడా మంచి కలెక్షన్స్ రావడం విశేషంగా చెప్పుకోవాలి. మొదటిరోజు హిందీలో 5 కోట్లే వసూలు చేసిన సినిమా, ఆ తరువాత శని, ఆది వారాల్లో పుంజుకొని వీకెండ్ ముగిసేసరికల్లా సుమారు 20 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

గతంలో సౌతిండియా నుంచి డబ్ అయి హిందీలో ఎక్కువ వసూళ్ళు రాబట్టిన సినిమాల్లో మొదటి స్థానంలో బాహుబలి (సుమారు 120 కోట్లు) ఉండగా, ఆ తర్వాతి స్థానంలో రజనీ, శంకర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ ‘రోబో’ (18 కోట్ల రూపాయలు) ఉంది. ఇక ఇప్పుడు కబాలితో రజనీ తన సినిమా రికార్డును తానే బ్రేక్ చేశారు. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన రియలిస్టిక్ గ్యాంగ్‌స్టర్ సినిమా అయిన ‘కబాలి’ని కళైపులి థాను నిర్మించారు. విడుదలకు ముందు సినిమా 200 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.