హిందీ టాప్ 10 జాబితాలో మొదటి, 10వ స్థానాలు మన దర్శకులవే

Published on Jul 10, 2019 12:58 pm IST

‘బాహుబలి’ చిత్రంతో రాజమౌళి హిందీ పరిశ్రమను షేక్ చేసేశారు. ఎంతలా అంటే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ టెన్ హిందీ సినిమాల జాబితాలో మొదటి స్థానంలో బాహుబలి 2 హిందీ వెర్షన్ నిలబడింది. ఆ సినిమాకు దరిదాపుల్లో కూడా ఏ హిందీ చిత్రం లేదు. ఈ రికార్డును అధిగమించాలని ఇప్పటికే పలు ప్రయత్నాలు జరిగినా అవేవీ ఫలించలేదు.

ఇక ఈ జాబితాలోకి తాజాగా ‘కబీర్ సింగ్’ కూడా చేరింది. రూ. 200 కోట్లకు పైగా వసూళ్లతో 10వ స్థానాన్ని ఆక్రమించుకుంది. ఇది తెలుగు ‘అర్జున్ రెడ్డి’ చిత్రానికి రీమేక్. డైరెక్ట్ చేసింది తెలుగు దర్శకుడు సందీప్ వంగ. ఇలా హిందీలో అత్యధిక వసూళ్ళు కురిపించిన చిత్రాల టాప్ 10 జాబితాలో మొదటి, 10వ స్థానాలను సాధించింది మన తెలుగు దర్శకులు డైరెక్ట్ చేసిన సినిమాలే కావడం నిజంగా హర్షించదగిన విషయం.

సంబంధిత సమాచారం :

X
More